Wednesday , July 24 2024

టికెట్ ఇప్పించినోళ్లే…గెలిపించే బాధ్యత తీసుకోండి…

టికెట్ రావడంలో ప్రధాన భూమిక కార్యకర్తలదే….

శ్రీహరి ముదిరాజ్ ఇంటికి వచ్చి అభ్యర్థిస్తున్నా…

పాలమూరు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి…

మఖ్తల్ కాంగ్రెస్ కు కంచుకోట….

నాకు తోడుగా ఎంపీగా వంశీఅన్నని గెలిపించండి…

ఎమ్మెల్యేవాకిటి శ్రీహరి…

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

దేశవ్యాప్తంగా కేవలం 39 మందిని తొలిజాబితా కింద కాంగ్రెస్ పార్టీ లోక్ సభ అభ్యర్థులుగా ప్రకటించగా…తెలంగాణ నుంచి నలుగురిని మాత్రమే ఎంపిక చేయగా..తొలిజాబితాలోనే తనను మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారని, టికెట్ దక్కడంలో కీలకపాత్ర పోషించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నానని, టికెట్ ఇప్పింటినోళ్లే తనను గెలిపించే బాధ్యత తీసుకోవాలని చల్లా వంశీచందర్ రెడ్డి అన్నారు. మఖ్తల్ పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల కృతజ్ఞతా మీటింగ్ కు ఎమ్మెల్యేవాకిటి శ్రీహరితోపాటు కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి మాట్లాడుతూ,
ఎన్నికలు పూర్తయ్యేవరకు కార్యకర్తలందరూ ప్రతి కార్యకర్త దీక్ష చేపట్టి, కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు. మఖ్తల్ నియోజకవర్గ పూర్తి బాధ్యత ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి భుజాలమీద పెడుతున్నామని తెలిపారు. మఖ్తల్ నియోజకవర్గంలో కార్యకర్తల బలగం పూర్తిస్థాయిలో ఉందని, ఈసారి భారీస్తాయిలోమెజారిటీ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, మఖ్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని, 2018లో ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ గుర్తు లేకపోయినా…ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో ఎవరూ ముందుకు రాకపోయినా వంశీచందర్ రెడ్డి ధైర్యంగా నిలబడ్డారని, ఆ సమయంలో 30వేలకుపైగా ఓట్లు వచ్చాయని అన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే ఎన్నికల్లో తనను కార్యకర్తలు, నేతలు అందరూ సమిష్టిగా నిలబడి శాసనసభ్యుడిగా గెలిపించుకున్నారని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలం తోడయిందని, ఈ సారి మరింత ఎక్కువ మెజారిటీ వంశీచందర్ రెడ్డికి అందించాలన్నారు. కేవలం 48 గంటల్లో రెండు హామీలు అమలు చేసిన ఘనత సీఎంరేవంత్ దేనని, తాజాగా మరో రెండు హామీలు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 500కే సిలిండర్ అమలు చేస్తున్నారని అన్నారు. కేవలం 90 రోజుల్లోనే 13 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో సీసీరోడ్లు వేసుకుంటున్నామని, మఖ్తల్ ను అభివృద్ది చేయడమే తన ధ్యేయమన్నారు. తాను 365 రోజులు అందుబాటులో ఉంటానని, రాబోయే రెండు నెలలు కార్యకర్తలు మరింతగా కష్టపడి ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని భారీమెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆ తర్వాత జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించే బాధ్యతను తాము ఇద్దరం తీసుకుంటామన్నారు. అనంతరం వంశీచందర్ రెడ్డి, వాకిటి శ్రీహరిలను నేతలు, కార్యకర్తలు సత్కరించారు. కార్యక్రమంలో నేతలు బాలక్రిష్ణారెడ్డి, నాగరాజ్ గౌడ్, లక్ష్మారెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, గోపాల్ రెడ్డి, గణేశ్ కుమార్, రవికుమార్, కట్టా సురేశ్ గుప్తా, వైస్ ఎంపీపీ రామేశ్వరి, అన్నిమండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అన్ని విభాగాల నేతలు, కార్యకర్తలు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.