Thursday , May 23 2024

రైతులపై రౌడీ షీట్ లా ..

కాలుష్యం వెదజల్లుతున్న చిత్తనూరు ఇథనాల్ కంపెనీ పై కనీస చర్యలు లేవు

కాలుష్యాన్ని ప్రశ్నించిన బాధిత రైతులపై మాత్రం లాఠీఛార్జ్, పోలీసు దాడులు, కేసులు, చిత్రహింసలు, నిర్బంధం, జైళ్లు, రౌడీషీట్లు
పర్యావరణ విద్వంసానికి పాల్పడుతున్న చిత్తనూరు ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలి.

ఇథనాల్ పాలసీని తెచ్చిన భాజపా, బలపరిచిన బారాస లను నిలదీద్దాం.

ఇథనాల్ పాలసీపై కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం వైఖరిని ప్రశ్నిద్దాం.
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
కాలుష్యకారక చిత్తనూరు ఇథనాల్ కంపెనీని రద్దు చేయాలని గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న పోరాటంలో భాగంగా 21 అక్టోబర్ 2023న వ్యర్థపదార్థాల ట్యాంకర్ ను పట్టుకుని శాంతియుత నిరసన చేపట్టారు. దానిని సహించలేని కంపెనీ యజమాన్యం, బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వెన్నుదన్నుతో పోలీసుల చేత బాధిత రైతులపై అక్టోబర్ 22న దాడులు చేయించింది.ఆ దాడిలో అనేక మంది రైతులు గాయపడ్డారు. మహ్మద్ ఖాసీం అనే రైతు చికిత్స పొందుతూ చనిపోయాడు. 78 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించి నెల రోజులపాటు జైల్లో నిర్బంధించారు. అనంతరం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించారు. ఏ కారణం చేత అయితే ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో ఆ కారణాలు నేటికీ పరిష్కారం కాకపోగా నిర్బంధాలు, అణచివేతలు ఎక్కువయ్యాయి. నూతనంగా గెలిచిన స్థానిక ఎమ్మెల్యేలను కలిసి కాలుష్యం ఉత్పత్తి చేస్తున్న ఇథనల్ కంపినినీ రద్దు చేయాలని, రైతులపై పెట్టినటువంటి అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలనీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. పైగా గత నెలలో రైతులపై రౌడీషీట్లు తెరవడం శోచనీయం. ఈ విషయాలన్నింటినీ ప్రజల దృష్టికి రాష్ట్రంలో ఉన్న మేధావులు ప్రజాస్వాములు దృష్టికి తీసుకెళ్లి తీసుకు వెళ్ళడానికి ఈనెల 18న హైదరాబాద్లో జరిగి రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం.

మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ కరపత్రం ఆవిష్కరించిన పోరాట కమిటీ ప్రతినిధులు.
పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఎం వెంకట్రాములు, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే చక్రవర్తి , చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ శ్రీదేవి, కుల నిర్మూలన పోరాట సమితి నాయకులు మహదేవ్, ఎక్లాస్పూర్ రైతు మండలి నాయకులు యు రామచందర్, బండారి మల్లేష్, బండారి అంజనేయులు, శివపొల్ల లక్ష్మయ్య, పాలమూరు అధ్యయన వేదిక జిల్లా కో కన్వీనర్ ఎం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.