Saturday , October 12 2024

ముదిరాజ్ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు మేకల హనుమంతు . తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం లో ముదిరాజ్ సంఘం నూతన క్యాలెండర్ను మేకల హనుమంతు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన ముదిరాజులలో చైతన్యవంతం కావాలని గ్రామ గ్రామాలలో కమిటీలు ఎన్నిక చేసుకోవాలని మండల జిల్లా రాష్ట్రస్థాయిలో ముదిరాజులు చైతన్యవంతం అవడం కొరకు ప్రతి ఒక్కరూ కంకణ బదులు కావాలని వారు ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పన్నాడి వెంకటయ్య మండల వైస్ ప్రెసిడెంట్ కావలి మొగల్ప్ప. మండల ప్రధాన కార్యదర్శి నీలి వెంకటయ్య. పి ఎస్ సి హెచ్ చైర్మన్ పుట్టి తప్ప చేపల వెంకటయ్య పాపనపల్లి నర్సింలు వి సత్యనారాయణ మహిపాల్ సర్పంచ్ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ సుభాష్. తదితరులు పాల్గొన్నారు.