తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.
.అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో స్థానిక మక్తల్ లోని మహాత్మ పూలే చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆనాటి సమాజంలో వెనుకబడిన వర్గాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జీవిత పర్యంతం వరకు పోరాడిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే గారని ఆయనే నిజమైన మహాత్మా అని కొనియాడడం జరిగింది. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ చిన్నతనంలో తన బ్రహ్మణ స్నేహితుడి పెళ్లి కార్యక్రమంలో అవమానానికి గురైన మహాత్మ జ్యోతిబాపూలే గారు అసమానలతో కూడిన ఈ కుల వ్యవస్థను వ్యతిరేకించాలంటే చదువు ముఖ్యమని అందులో అంటరాని వర్గాలకు మరీ ముఖ్యమని భావించి ఎన్నో పాఠశాలలను స్థాపించి అంటరాని వర్గాల వరకు చదువు చెప్పిన గొప్ప మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే గారని, అంతేకాకుండా గులంగిరి అనే పుస్తకం ద్వారా ఈ దేశంలో అనాదిగా వస్తున్న అమానవ్యమైన కులాచారాలను వాటి గుట్టును బయటి సమాజానికి అర్థమయ్యేలా చేశాడని ఆయనను అందరు స్ఫూర్తిగా తీసుకొని నేటికీ దేశంలో అంటరానితనం కొనసాగుతుందని దాని రూపుమాపడానికి మనమంతా కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా డిటిఎఫ్ జిల్లా కార్యదర్శి సూర్యచంద్ర గారు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే గారు విద్యారంగం ప్రాముఖ్యతను గుర్తించి మరీ ముఖ్యంగా అంటరాని వర్గాలకు మహిళలకు విద్యను అందించడంలో నాటి బ్రిటిష్ అధికారులతో మాట్లాడి మనువాద సమాజానికి సవాల్ గా మారాడని, అంతేకాకుండా తదనాంతరం సత్యశోధకు సమాజ్ అనే సంస్థ ద్వారా స్నేహితులతో కలిసి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొల్లపల్లి నారాయణ మాట్లాడుతూ బీసీ నాయకులు జయంతులను బీసీలు జరుపుకోవడంలో వెనుకబడే ఉన్నారని తన ఆవేదనను వ్యక్తం చేశారు. అదేవిధంగా రాజుల ఆశిరెడ్డి మాట్లాడుతూ అన్నగారిన వర్గాల అభివృద్ధి నిజమైన అభివృద్ధి అని అందుకు మహాత్మ జ్యోతిబాపూలే ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ దత్తాత్రేయ మాట్లాడుతూ దండోరా మరియు అణగారిన వర్గాలకు న్యాయం చేకూరే ఉద్యమాలను కులం పేరుతో చూస్తూ వాటిని చులకన చేయడం జరగడం వల్ల బడుగు బలహీన వర్గాల చైతన్యాన్ని నీరుగారుస్తున్నారని అందులో భాగంగానే మహాత్మ జ్యోతిబాపూలే వంటి మహనీయులను వారి కృషికి తగ్గ గుర్తింపు ఇవ్వడంలో ఈ దేశ పౌరులు వెనుకబడి ఉన్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. పాలెం వెంకటయ్య బిఎస్పి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబా పూలే వంటి నాయకుల జీవితాలను వారి కృషిని ప్రసంగల రూపంలో ఊదరగొట్టిన వాటిని ఆచరించని ఎడల ప్రయోజనం శూన్యమే అని నాయకులు ఈ విషయాన్ని గుర్తించి మహనీయుల ఆశయాలను ఆచరణలో పెట్టాలని సూచించడం జరిగింది. అదేవిధంగా డిటిఎఫ్ పరంధాములు మాట్లాడుతూ అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా కులవివక్షత వ్యతిరేక చట్టాన్ని తీసుకురావడంలో ప్రధాన కారణం ఈ దేశం నుండి వెళ్లిన పెద్ద చదువులు చదివిన అగ్రవర్ణాల వారి కారణమని అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆర్టిఏ గొల్లపల్లి నారాయణ మాట్లాడుతూ మహనీయుల గురించి వారి కృషిని గురించి ఎన్నోసార్లు ఎన్నో వేదికల మీద చెబుతున్నప్పటికీ ఇంకా ఈ దేశంలో మహనీయుల విగ్రహాల పైన మహనీయుల చిత్రపటాల పైన తమ అక్కస్ను వ్యక్తం చేస్తూనే ఉన్నారని కాబట్టి మనమంతా ఇంకా చైతన్యవంతులమై మహనీయుల కృషిని బయట సమాజానికి అర్థం చేయడంలో శక్తికి మించి పని చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మరియు గౌరవ మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పట్టణ అధ్యక్షులు రవికుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బి చంద్రకాంత్ గౌడ్ డిటిఎఫ్ నాయకులు సూర్య చంద్ర పరంధాములు అడ్వకేట్ దత్తాత్రేయ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోలపల్లి నారాయణ మరియు మాజీ కౌన్సిలర్ హనుమంతు కావలి తాయప్ప కోళ్ల వెంకటేష్ డి.ఎస్.పి నాయకులు అర్జున్ రాజ్ పాలెం వెంకటయ్య బండారి చంద్రశేఖర్, టీవీ వి రాష్ట్ర మాజీ అధ్యక్షులు మద్దిలేటి, టిఆర్ఎస్ నాయకులు కృష్ణ టీవీవి, కాంగ్రెస్ నాయకులు పోర్ల నర్సింలు, ఉప్పరపల్లి అంబేద్కర్ అధ్యక్షులు బాలకృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం సాంస్కృతిక కార్యదర్శి పరంజ్యోతి, సభ్యులు తల్వార్ నరేష్ , రాజుల ఆశిరెడ్డి,జగదీష్, భీమన్న, కే ఎన్ పి ఎస్ నాయకులు విజయ్ కుమార్, ఆర్టిఐ నాయకులు గోలపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నార.