Monday , July 22 2024

మక్తల్లో ఘనంగా రంజాన్ వేడుకలు.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి.

మక్తల్లో గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుండి ముస్లింల వారి ఆచారం ప్రకారం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది న్నారు.ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం 30 రోజులపాటు ఉపవాస దీక్ష చేపట్టి ఇవాళ రంజాన్ ఈద్ సంద ర్భంగా ఉపవాస దీక్షను వదిలి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

పట్టణ శివారులో రైచూర్ రోడ్డులో ఉన్న ఈద్గా వద్ద చిన్న.పెద్ద. హోదాలు లేకుండా అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనల చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముస్లిం సోదరులను కలుసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. చిన్న పెద్దలు అందరిని కలిసి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్టా సురేష్ కుమార్ ,బోయ రవికుమార్ ,మేదరి శ్రీనివాసులు, గణేష్ కుమార్.కావలితాయప్ప చంద్రకాంత్ గౌడ్, కోళ్ళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.