Sunday , May 26 2024

అవును నీవు ముమ్మాటికీ దొరసానివే-మొదటి నుండి వెన్నుపోటు పొడవడం నీ నరా నరాల్లో ఉంది-సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత నీకు లేదు

  • డీకే అరుణ పై వంశీ చందు రెడ్డి ఫైర్
    తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి : బిజెపి అభ్యర్థి అరుణమ్మ దొరసానే .. ఆమెకు మొదటి నుండి వెన్నుపోటు రాజకీయాలు చేయడం నర నరాలలో ఉంది అని ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు, మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి ఆరోపించారు. అటువంటి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదు అని ఆయన పేర్కొన్నారు. బుధవారం ద్వారక ఫంక్షన్ హాల్ లో మక్తల్ పట్టణంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశానికి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోర్ట్ సలహాదారుడు జితేందర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా వంశీ చంద్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలతో ఆరితేరిన నిన్ను తెలుగుదేశం పార్టీ ఎంపీగా పోటీ చేసినప్పుడు ఆమెను మద్దతు ఇవ్వకండి అని మీ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఈ నియోజకవర్గ నాయకులకు విజ్ఞప్తి చేశారు అని వంశీ చందర్ రెడ్డి గుర్తించారు. మీ వెన్నుపోటు రాజకీయాన్ని మీ సొంత తండ్రి గుర్తించారు అని పేర్కొన్నారు నియోజకవర్గంలో లక్షల ఎకరాల నీరు పారి సంగంబండ ప్రాజెక్టు నర్సిరెడ్డి పేరు పెట్టిన అడ్డుగా ఉన్న బండను తొలగించేందుకు అవసరమైన 10 కోట్లతో నిధులను మంజూరు చేయించని నువ్వు ఈ ప్రాంత ఆడబిడ్డ ఎలా అవుతావని ఈ ప్రాంతానికి నువ్వు చేసింది ఏమేమి ఆయన ఆయన ప్రశ్నించారు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో గుట్టలను పిండిగా చేసి కంకర అమ్ముకుని. ఇసుక. నల్ల మట్టి తలించి కోట్ల రూపాయలను సంపాదించావని ఈ ప్రాంతలో మద్యం మాఫియా దించిన నువ్వు ఈ ప్రాంతం దోచుకున్నవే తప్ప అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గంలో 284 బూతులు కమిటీలు వేసి ఒక్కొక్క బూతులో పదిమంది కార్యకర్తలతో 40 రోజులు ప్రచారం చేస్తే తప్పకుండా 70 వేల మెజార్టీ రావడం తత్యం అన్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలవడానికి నియోజకవర్గ ప్రజలు తనను సొంత బిడ్డలా చూసుకుని గెలుపుకు కష్టపడ్డారని అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న వంశీ చందర్ రెడ్డి గెలుపు కూడా తనకు కష్టపడిన నియోజకవర్గం కాంగ్రెస్కు కంచుకోట అని నిరూపించాలని అన్నారు. జడ్పీ చైర్ పర్సన్ వనజ మాట్లాడుతూ క్రింది స్థాయి కార్యకర్తలు కష్టపడి పని చేస్తేనే అభ్యర్థి గెలుపు ఉంటుందని అందుకు పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్త గుర్తించి వారికి న్యాయం చేస్తామని చెప్పారు. గ్రామాలలో ఇప్పటికే గద్వాల సంబంధించిన అనేకమంది వేలాది రూపాయలు ఇస్తూ తాయిలాల ఇస్తూ తమవైపు దిక్కునడం కొరకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వారిని నమ్మే పేర్లు చెప్తే లేదని ప్రజలు ఏకమై ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి , కోల వెంకటేష్ , కావలి శ్రీహరి, కావలి తాయప్ప ,గణేష్ కుమార్ , రవికుమార్, కట్టా సురేష్.చంద్రకాంత్ గౌడ్.కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.