Saturday , October 12 2024

గొల్ల కురుమలకు ఎస్సీ ముదిరాజులకు బేస్త సర్టిఫికెట్.ఇచ్చేందుకు ప్రభుత్వంతో పోరాటం చేస్తా..ఎంపీ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి.

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి మే 5

తెలంగాణ రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన ముదిరాజుల కు గొల్ల కురుమల సంక్షేమానికి. కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని .ముదిరాజ్ కులాన్ని బీసీ డీ గ్రూపు నుండి ఏ గ్రూపులోకి గొల్ల కురుమలకు ఎస్సీ గ్రూపులో కిమార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని పాలమూరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశిచందర్ రెడ్డి అన్నారు.
మక్తల్ నియోజకవర్గం కేంద్రంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ముదిరాజుల .ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

పాలమూరులో ముదిరాజుల మద్దతుతో మద్దతుతో ఎంపీగా తాను గెలవబోతున్నానని అన్నారు. సారా వ్యాపారం, అక్రమ క్రషర్ ,అక్రమ కల్లుదంతాలతో కోట్లకు పడగలెత్తిన ప్రత్యర్థుల ముందు సామాన్య రైతు కుటుంబానికి చెందిన తాను ఎన్నికల్లో గెలుస్తానా లేదన్న చిన్న అనుమానం ఉండిందని ముదిరాజుల మద్దతుతో వందకు వంద శాతం తాను ఎంపీగా గెలవడం ఖాయం అయిపోయిందన్న ఆత్మవిశ్వాసం ఇవాళ తనకు కలిగిందని అన్నారు. మాట ఇస్తే మడమతిప్పని ముదిరాజులు. గొల్ల కురుమల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో సబ్సిడీపై గొర్రెలు ఇస్తామని డీడీలు కట్టించుకొని చేతులెత్తేసిందని మీకు మోసం చేసిందని కట్టిన డబ్బులు ఇప్పించేందుకు డిడిలు కట్టిన వారు దరఖాస్తు చేసుకుంటే ఆ పైసలు ఇప్పించే బాధ్యత తను తీసుకుంటానని వంశీచంద్ర రెడ్డి సంఘాల వారికి హామీ ఇచ్చారు. సంక్షేమానికి ముదిరాజుల. గొల్ల కురుమల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటిని ఈ రెండు కులాల వారు అధికంగా ఉన్న పాలమూరు జిల్లాలో వారికి అందుబాటులో తీసుకరాకుండా ఈ ప్రాంతం నుండి ఎంపికైన ఎంపీలు న నిర్లక్ష్యం చేశారనీ.కాంగ్రెస్ ప్రభుత్వం .గొల్లకురుమల.ముదిరాజుల సంక్షేమానికి అబివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.