💥 ప్రజా పాలన పేరుతో కొనసాగుతున్న కాంగ్రెస్ దోపిడి పాలన
💥 మక్తల్, సంగంబండ దొరకు అడ్డాగా మారిన దన్వాడ పెద్ద చెరువు
💥 లక్షలు విలువైన సారవంతమైన ఒండ్రు మట్టిని అడ్డంగా దోచుకుంటున్న సంగంబండ దొర
💥 ప్రజలకు చెప్పేది ఆరు గ్యారంటీలు!
💥 ప్రభుత్వ సంపదను దోచుకోవడం కాంగ్రెస్ ఏడో గ్యారంటీ!
💥 అధికార బలంతో ప్రభుత్వ సంపదను లూటీ చేస్తున్న షాడో ఎమ్మెల్యే
💥 ఇసుక మాఫియా ఒండ్రు మట్టి,ఎర్ర మట్టి మాఫియాకు షాడో ఎమ్మెల్యే అండ!
💥 అధికార పార్టీ కనుసన్నల్లో రెవెన్యూ&ఇరిగేషన్ అధికారులు
💥 ఇది ప్రజా పాలనా? ,ఇందిరమ్మ పాలనా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి!
💥 అక్రమ మట్టి,ఇసుక,మాఫియాను అరికట్టకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్థాం!
*బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్. తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి. యన్
నారాయణ పేట జిల్లాలో ప్రజా పాలన పేరుతో దోపిడి పాలన కొనసాగుతున్నదని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బొదిగెలి శ్రీనివాస్ ఆరోపించారు.శనివారం దన్వాడ మండల కేంద్రంలోని పెద్ద చెరువును సందర్శించారు.అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇసుక, ఎర్రమట్టి,ఒండ్రు మట్టి మాఫియాకు అధికార పార్టీకి చెందిన షాడో ఎమ్మెల్యే అండగా ఉండీ ప్రభుత్వ సంపదను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరు చెప్పి ప్రభుత్వ సంపదకు అడ్డంగా దోచుకోవడం కాంగ్రెస్ పార్టీ ఏడో గ్యారంటీ అని తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, నీళ్ళ పేరుతో ఒండ్రు మట్టిని అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని అధికార పార్టీ నాయకులు దోచుకుంటున్నారన్నారు. ఇంతటి అక్రమ లూటీ జరుగుతుంటే రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు మాత్రం కమీషన్ల మత్తులో మునిగి,కనీస పర్యవేక్షణ లేకుండా అధికార పార్టీ నాయకులకు సహకరిస్తున్నారని ఆరోపించారు.ప్రజల పేరు చెప్పి దోపిడి చేస్తే పేట ప్రజల తిరగబడి కాంగ్రెస్ పార్టీని తరిమి కొడతారని హెచ్చరించారు.తక్షణమే ఈ మాఫియాను అరికట్టకపోతే బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అద్యక్షులు రవి యాదవ్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు