Thursday , May 23 2024

మోదీ కుటుంబ సభ్యులం అంటూ ప్లకార్డుల ప్రదర్శన

తెలంగాణ కెరటం : కల్లేర్ నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి (మార్చ్ 11 )…..
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్లేర్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పై ఆర్జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రధానమంత్రికి మద్దతుగా కల్లేరు మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు యన్నం అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మోదీ మా అన్న మేము మోది కుటుంబ సభ్యులం అంటూ ప్లకార్డుల ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. ప్రధానమంత్రి పై లాలూ ప్రసాద్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు సంగమేశ్వర్.సాయిలు, చంద్రయ్య. పండరి.అరవింద్ మరియు బిజెపి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.