Wednesday , September 18 2024

వాట్సప్ వాడే వారికి పోలీసుల హెచ్చరిక

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి మే 13

నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి, సీఐ.. శ్రీనివాసరెడ్డి

నారాయణఖేడ్: వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లకు సభ్యులకు ఇతర సోషల్ మీడియా యూజర్లకు పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఈరోజుతో ప్రచారం ముగిసినందున వాట్సప్ గ్రూపుల్లో కానీ ఇతర వాటిల్లో కానీ ఎలాంటి రాజకీయాలకు సంబంధించిన పోస్టులు చేయొద్దని తెలిపారు.నిబంధనలు ఉల్లంఘించి పోస్ట్ చేసిన షేర్ చేసిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు కార్యకర్తలు పోలీసులకు సహకరించాలన్నారు.