Tuesday , July 16 2024

ఖేడ్ :మున్సిపల్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి( మే 4)..

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ పట్టణంలోని సాయి బాబా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాసన సభ్యులు.డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ప్రతి గడపాకి వెళ్లి మనం చేసిన మనం చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మరియు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలు వివరంగా చెప్పాలని అన్నారు.
గత ఎమ్మెల్యే పట్టణాన్ని అసలు పట్టించుకోలేడు.ప్రజలు నన్ను విశ్వసించి గెలిపించారు
మన అభ్యర్థి.సురేశ్ షేట్కార్ ని పట్టణం నుండి వచ్చిన మెజారిటీ కంటే అధిక మెజారిటీ తెచ్చాల పనిచేయాలని అన్నారు.
కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్ షేట్కార్ మున్సిపల్ చైర్మన్.ఆనంద్ స్వరూప్ షెట్కాట్. వైస్ చైర్మన్.దారం శంకర్ మరీయు కౌన్సిలర్లు , నాయకులు ,కార్యకర్తలు పాల్గోన్నారు.