Monday , July 22 2024

మాజీ మంత్రి హరీష్ రావు వాహనం పోలీసులు తనిఖీ

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 14

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. నారాయణఖేడ్ ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందం వాహనాల తనిఖీ చేపట్టారు. నారాయణఖేడ్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సమావేశానికి హాజరై వెళ్తున్న హరీష్ రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేపట్టారు వాహన తనిఖీ జరిగినంత సేపు మాజీ మంత్రి హరీష్ రావు సహకరించి కారులోనే కూర్చొని ఉన్నారు