తెలంగాణ కెరటం :నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 14
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి 133 వ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి
అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన సురేష్ కుమార్ షట్కార్ జిల్లా కాంగ్రెస్ నాయకులు శశికళ యాదవ్ రెడ్డి
బాబా సాహెబ్ అంబెడ్కర్ మహానియుడని మనకి ఈరోజు అందరికి సమాన హక్కులు ఉన్నాయంటే అది బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి వల్లే అని అన్నారు
ఆ మహానియుడిని స్మరించుకుంటు ఆయన వేసిన బాటలో నడుస్తూ సమాజ అభివృద్ధి కి కృషి చేద్దాం అని అన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం లో నెహ్రు గారి నుండి మన్మోహన్ గారి వరకు ప్రధానులు రాజ్యాంగ పరిరక్షణ చేస్తూ కట్టుబడి పని చేసారని ఇప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని.ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన సురేశ్ కుమార్ షేట్కార్ ని గెలిపించాలని కోరారు
కార్యక్రమంలో.శాసన సభ్యుల తో పాటు జహీరాబాద్ పార్లమెంట్ కో ఆర్డినేటర్ శశికళ యాదవ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి.సురేష్ కుమార్ షేట్కార్. డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు