Monday , September 16 2024

ఆరు కుక్కల దాడిలో 60 గొర్రెలు మృతి

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 10..

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలంలో గల బెల్లాపురం గ్రామ దత్తాత్రేయ మఠం వద్ద గల గొర్రె పిల్లలపై మంగళవారం కుక్కలు దాడి చేయడంతో 60 గొర్రె పిల్లలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. నారాయణఖేడ్ మండలం జగనాథ్ పూర్ గ్రామానికి చెందిన గల్గొండ. సుధాకర్ ల మేపుతూ బెల్లాపూర్ వెళ్లారు. రాత్రి సమయంలో కాపల ఎవరూ లేని సమయంలో కుక్కలు గొర్రె పిల్లలపై దాడి చేశాయి.తక్షణమే సాయం కింద ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు