Monday , July 22 2024

హెల్త్ సెంటర్ ఆకస్మిక తనిఖీ

తెలంగాణ కెరటం: నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 10

సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం లోని హన్మంతరావు పెట్ గ్రామంలో గల ప్రైమరీ హెల్త్ సెంటర్ ని శాసన సభ్యులు.డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది
సెంటర్ లో గల రిజిస్టర్ ని చెక్ చేసి సెంటర్ వివరాలను అడిగి తెలుసుకున్నారు
పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సెంటర్ కి ఏదన్నా కావాలంటే ఇవ్వడానికి తను సిద్ధంగా ఉన్నానని అన్నారు.హెల్త్ సెంటర్ నిర్వహణ పై సంతృప్తి ని వ్యక్తం చేశారు
కార్యక్రమంలో శాసన సభ్యులు తో పాటు మాజీ ఎంపీటీసీ పండరీ రెడ్డి , రాజు సెట్ , మాధవర్ తండా జాధవ్ సర్ధార్ తదితరులు పాల్గొన్నారు