Monday , September 16 2024

ముఖ్య కార్యకర్తల సమావేశం

తెలంగాణ కెరటం నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 8

జహీరాబాద్ పార్లమెంట్ నారాయణఖేడ్ నియోజకవర్గం లోని కల్హేర్ మరియు శంకరంపేట మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మె,ల్యే భూపాల్ రెడ్డి
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు
జహీరాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపెట్(ఏ )& కల్హేర్ మండల కార్యకర్తల విసృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసిన నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్ రెడ్డి గారు మాసన్ పల్లి (ఎక్స్) రోడ్ లోని వెంకటాద్రి గార్డెన్స్ లో నిర్వహించారు ,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జహీరాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ గాలి అనిల్ కుమార్ గారు పాల్గొన్నారు .
ఈ సందర్భంగా అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ
ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ మోసం చేశారు.
ఎన్నికల హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు.
డిసెంబర్ 9న 2 లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పిన రేవంత్ మాట నిలబెట్టుకోలేదు.
బ్యాంకులు రైతులకు నోటీసులు పంపుతున్నాయి. రైతులు కష్టాలపాలయ్యారు.
కోతలరాయుడు రేవంత్ వడ్లకు 500 బోనస్ ఇచ్చి 2500కు కొంటానన్నాడు. యాసంగి వడ్లకన్నా ఇవ్వాలి కదా. వ్యవసాయం మీద దృష్టి పెట్టమంటే రాజకీయ వలసలపై దృష్టి పెట్టిండు.
వందరోజుల్లో అమలు చేస్తామన్న హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎన్నికల్లో చురుకు పెట్టాలి.
రైతుబంధు కింద పెంచుతామని చెప్పిన 15వేలూ రాలేదు.
కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను కూడా మోసం చేశారు.
కేసీఆర్‌కు రైతు అంటే మొదలు, రేవంత్‌కు రైతులంటే చివర.
కానీ ఇప్పుడు కరెంటు పోతోంది. నాలుగు నెలల కాలంలో రైతులను రాచి రంపాన పెట్టిండ్రు.
కేసీఆర్ మాట మీద నిలిచి పింఛన్ మొత్తాన్ని 2వేలకు పెంచిండు. కాంగ్రెస్ ఆ పింఛన్ కూడా ఎగ్గొట్టింది.
పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ సభ పతి బన్స్ వాడ ఎమ్మేల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలో 14 స్థానాల్లో ఎమ్మేల్యే లు తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగిందన్నారు.దానికి చిన్న చిన్న పొరపాట్ల వల్ల జరిగింది కావున అట్టి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు కావాలి. ప్రశ్నించే గొంతును గెలిపించాలి. పార్లమెంటు ఎన్నికల్లో,, లోకల్ బాడీ ఎన్నికల్లో కారునే గెలిపించాలి.
రేవంత్ ఆడవాళ్లకు నెలకు 2500 ఇస్తామని మోసం చేసిండు. అక్కచెల్లెళ్లు కారు మీద ఓటు గుద్దితే రేవంత్ రెడ్డి గూబ గుయ్యిమనాలి.
కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి ఆ హామీనీ ఎగ్గొట్టిండు. వచ్చే లక్ష కూడా రావడం లేదు.
మహరెడ్డీ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే. మాట్లాడుతూ.ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయిలో తిరిగి కాంగ్రెస్, బిజేపి పార్టీలు ప్రజలకు వేతిరేకంగ చేస్తున్న పనులను ఎండగట్టి మరోసారి మన కారు గుర్తుకు ఓటు వేయించి మన తెలంగాణ తొలి ముఖ్య మంత్రి కేసీఆర్ గారికి కనుక ఇద్దమ్మన్నరు.
నిరుద్యోగులకు 4 వేలు ఇస్తామని చెప్పిండు రేవంత్. కానీ అసలు ఆ హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం నిండు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పిండు.
ఇంత మోసం చేసిన కాంగ్రెస్ ఓటు వేస్తే గొర్రె కసాయివాడిని నమ్మినట్టే.
పదేళ్ల బీజేపీ పాలనలో పేదరికం, నిరుద్యోగం పెరిగింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి.
కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి. మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇప్పడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు. వంద రోజుల తర్వాతే కోడ్ వచ్చింది.

  • 2 లక్షల రుణమాఫీ,
  • ⁠వడ్లకు మక్కలకు 500 బోనస్,
  • ⁠4 వేల ఫించన్,
  • ⁠రైతుబంధు 15 వేలు,
  • ⁠ మహిళలకు 2500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం,
  • ⁠4 వేల నిరుద్యోగ భృతి,
  • ⁠ఆడపిల్లలకు ఉచిత స్కూటీ అందినవాళ్లే కాంగ్రెస్‌కు ఓటేయండి, అందనివాళ్లు బీఆర్ఎస్‌కు ఓటేయండి.
    కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటోంది. ఎన్నికల హామీలను కాంగ్రెస్ మెడలు వంచి అమలు చేయిస్తాం.
    తెలంగాణ అభివృద్ధి కోసం కష్టపడిన బిఆర్ఎస్ పార్టీని గెలిపించండి.
    బీఆర్ఎస్‌కు ద్రోహం చేసిన బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగాడు బిబి పాటిల్. అతణ్ని కచ్చితంగా ఓడగొట్టి మూడో స్థానంలో నిలబెట్టాలి.
    డబ్బులకు, పదవులకు ఆశపడేవాళ్లు మాత్రమే పార్టీలు మారుతున్నారు. ఉద్యమకారులను కాంగ్రెస్ కొనలేదు.
    బీజేపీ పాలనలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయి. ఆ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదు.
    కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు. అవసరమైతే మా ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుకుంటాం.

ఈ కార్యక్రమంలో
సర్పంచులు , ఎంపీటీసీలు, జెడ్పిట్సీలు, మండల , గ్రామ పార్టీ అధ్యక్షులు – ⁠ రెండు మండలల నుంచి భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.