టీఎన్జీవోస్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి
తెలంగాణ కెరటం: నల్గొండ బ్యూరో మార్చ్ 1/ 2024
తెలంగాణ రాష్ట్ర రోడ్లు భావనల శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ మేరకు ప్రతి నెల 1వ తేదిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ దారులకు జీతాలు ఇచ్చేందుకుగాను సబ్ కమిటీ జీవో నెంబర్292 ద్వారా ఉత్తర్వులు ఇచ్చేందుకు కృషి చేసిన మంత్రి కోమటిరెడ్డి కి టి.న్.జి.ఓ. పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికిమరియు రాష్ట్ర రోడ్లు భావనల శాఖా మాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. అని టీఎన్జీవో నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ళ మురళి అన్నారు మంత్రి ఆశిస్సులు ఎల్లా వేళ్ళల ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ మరియు పెన్షన్ దార్లఫై వుండాలని కోరుకుంటూ అదే విధముగా జి.ఓ. 317 ద్వారా అమలు జరిపిన ఉద్యోగుల విభజనలో ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారాలను సిఫార్సు చేయడం కోసం జీవో 299 ద్వారా సబ్ కమిటీని ముగ్గురు మంత్రివర్యులతో సబ్ కమిటీని ఏర్పాటు చేయడం టీఎన్జీవో యూనియన్ స్వాగతిస్తున్నది. ప్రభుత్వం జారి చేయు సంక్షేమ పథకాలను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి మా వంతు కృషి చేసి ప్రభుత్వనికి వెన్నుదన్నుగా ఉంటామని హామీ ఇస్తున్నాం.