క్రాంతి కుమార్ మక్కడ్
తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఫిబ్రవరి 25/2024
ఆల్ ఇండియా రీజినల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయ్ అసోసియేషన్ పిలుపు మేరకు ఎనిమిది డిమాండ్లు మంజూరు చేయాలని రీజనల్ మేనేజర్ ఆశాలత కి వినతి పత్రం అందజేసిన ఏపీజీవీబీ ఉద్యోగులు నల్లగొండ పట్టణంలో రీజనల్ రూరల్ బ్యాంక్ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నల్గొండ రీజినల్ ఆఫీసర్స్ అసోసియేషన్ మరియు ఏపీజీవీబీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమనికి ఏపీజీవీబీ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు క్రాంతి కుమార్ మక్కడ్ ముఖ్యఅతిధిగా విచ్చేసి నేషనల్ రూరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. అదేవిధంగా ఎనిమిది ప్రధాన డిమాండ్లను తక్షణమే ఒప్పుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమానికి ఏపీజీవీబీ ఆఫీసర్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్ గురువారెడ్డి ఏపీజీవీబీ ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎల్ బాలకృష్ణ ఏపీజీవీబీ ఎంప్లాయిస్ యూనియన్ కమిటీ సభ్యుడు డి నాగభూషణం తో పాటుగా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏపీజీవీబీ ఉద్యోగస్తులు ,అధికారులు మరియు టి పి టి ఎస్ ఉద్యోగులు పాల్గొని ఈ ధర్నాను జయప్రదం చేశారు.