జిల్లా వ్యాప్తంగా ముమ్మర తనిఖీలతో అక్రమార్కుల ఆట కట్టిస్తున్న జిల్లా పోలీస్ ..
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు జిల్లా యస్.పి చందనా దీప్తి
తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఫిబ్రవరి 25/2024
ప్రజా సంక్షేమం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
జిల్లా యస్.పి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా టాస్క్ ఫోర్స్ టీం నకేరేకల్ మరియు తిప్పర్థి పోలీస్ స్టేషన్ ల సిబ్బంది సమన్వయంతో తాటికల్ గ్రామంలో గల సురారపు పిచ్చయ్య తండ్రి లచ్చయ్య ఇంట్లో అక్రమ నిల్వ ఉంచిన 22 బస్తాలలొ 10 కింటాల్ పిడిఎస్ బియ్యం మరియు తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గల మామిడాల స్టేజ్ వద్ద నుండి బోలోరో వెహికిల్ ద్వార అక్రమ రవాణా చేస్తున్న మొగిలి ఉపేందర్ తండ్రి మైసయ్య,మొగిలి నాగరాజు తండ్రి చద్రయ్య,సాయి కుమార్ తండ్రి వెంకన్న ల నుండి 50 బస్తలలో 25 కింటాల్ల పీడీఎస్ బియ్యం బొలోరో వెహికిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది తెలిపారు. ఈ సందర్భంగా యస్.పి మాట్లాడుతూ… జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలైన గంజా,జూదం బెట్టింగ్,అక్రమ పీడీఎస్ రైస్ రవాణా, లాంటి వాటిని అరికట్టేందుకు నిరంతరం నిఘా పెడుతూ స్పెషల్ డ్రైవ్ లు చేస్తూ విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నామని అన్నారు. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పక్కదారి పట్టించిన, ప్రజల ఆహార భద్రతకు భంగం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.ఈ లాంటి నేరాలు అలవాటుగా చేస్తున్న వారి పై PD ఆక్ట్ చట్టం నమోదు చేస్తామని అన్నారు.అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయడం కోసం నిరంతరం స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తమని అన్నారు.
పట్టుబడిన నిందితుల వివరాలు
.
1.సురారపు పిచ్చయ్య తండ్రి లచ్చయ్య గ్రామం తాటికల్ మండలం నకిరేకల్ జిల్లా నల్లగొండ.
2.మొగిలి ఉపేందర్ తండ్రి మైసయ్య,గ్రామం తాటికల్ మండలం నకిరేకల్, జిల్లా నల్లగొండ.
3.మొగిలి నాగరాజు తండ్రి చద్రయ్య,గ్రామం తాటికల్, మండలం నకిరేకల్, జిల్లా నల్లగొండ.
4.సాయి కుమార్ తండ్రి వెంకన్న,గ్రామం తాటికల్,మండలం నకిరేకల్, జిల్లా నల్లగొండ.