Wednesday , July 24 2024

ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఏప్రిల్ 11

శ్రీ కోధి నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో కిన్నెర ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలువురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను ఆయన బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రోది నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండలన్నారు. అన్ని వర్గాల ప్రజలు వృద్ధిని సాధించాలని ఆయన కోరారు. కృషి పట్టుదలతో పని చేసుకుంటూ పోతే ఏ రంగంలో అయిన విజయం సాధించవచ్చునని ఆయన తెలిపారు. వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన ప్రముఖులకు ఉగాది పురస్కారాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఉగాది పురస్కారలు అందుకున్న వారు .
జెవి రాముడు మాజీ ఐపీఎస్,కె ఐ వరప్రసాద్ రెడ్డి ,శాంత బయోటెక్ , జస్టిస్ బి . శేషశయన రెడ్డి,మాజీ హైకోర్టు జడ్జ్,జె ఏ కమలాకర్ సైటిస్ట్, బి ఏం రెడ్డి ,ఆర్టిస్ట్ , జె అనురాధ నాట్య కళాకారులు ,జయ ప్రధ రామ్మూర్తి వేణుగానం ,తల్లవఝల పతంజలి శాస్త్రి సాహిత్య కారులు,ఈ కృష్ణా కిరణ్ డాక్టర్ ,విష్ణు బొట్ల సుబ్రమణ్యం శాస్త్రి ,ఆధ్యాత్మిక వేత్త,పి వి యన్ యస్ ప్రసాద్ ,ప్రముఖ ఆడిటర్ ,
సత్కారం అందుకున్న వారు
పద్మశ్రీ అవార్డు గ్రహీతలు
కూరేళ్ల విఠలా చార్యులు , ఉమామహేశ్వరి , గడ్డం సమ్మయ్య , కేతవత్ సోములా నాయక్ ,ఆనంద చారి , దాసరి కొండయ్య పాల్గొన్నారు