Tuesday , July 16 2024

టీఎన్జీవోస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఫిబ్రవరి 16/2024

ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పిలుపుమేరకు నల్గొండ జిల్లాలో టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగుల సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగింది.
ఉద్యోగులందరికీ ఓపిఎస్ ను అమలు చేయాలని సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని,
ఇన్కమ్ టాక్స్ పరిమితిని పదిలక్షల కు పెంచాలని,
కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయాలని,
పిఆర్సిని వెంటనే అమలు చేయాలని,
ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని,అన్ని కార్యాలయాల్లో కేడర్ స్ట్రెంత్ ను పెంచాలని,డిఎ లను విడుదల చేయాలని,
మొదలగు సమస్యలపై ధర్నా నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వందరోజులు కాకముందే ఉద్యోగస్తుల హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి తెలియచేశారని మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసినపుడు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయనతెలియచేసారు ,
ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని అట్టడుగు వర్గాలు , అర్హులైన వారందరికి చేర్చే విధంగా మా ఉద్యోగుల నిరంతరం పాటుపడతారని ప్రభుత్వానికి హామీ ఇస్తున్నాం అన్నారు
ఈ ధర్నా కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి,
కార్యదర్శి జె శేఖర్ రెడ్డి,
రాష్ట్ర ఉపాధ్యక్షులు చేపూరి నరసింహ చారి,
పట్టణ అధ్యక్షులు ఆకునూరిలక్ష్మయ్య,
నకిరేకల్ అధ్యక్షులు పాల్వాయి గామయ్య,
మునుగోడు అధ్యక్షులు పివెంకట్ రెడ్డి,
మిర్యాలగూడ కార్యదర్శి మధుసూదనా చారి,
కొండమల్లేపల్లి అధ్యక్షులు కత్తుల మనోజ్ ప్రదీప్,
జిల్లా ఉపాధ్యక్షులు వి భాస్కర్,
కే దశరథ, డిఐ రాజు, డి యాదయ్య,
జిల్లా సహాయ కార్యదర్శి ధరావత్ సైదులు నాయక్,
నాగార్జునసాగర్ యూనిట్ కార్యదర్శి కే లక్ష్మారెడ్డి,ఐసిడిఎస్ ఎంప్లాయిస్అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్,జిల్లా సహాయ కార్యదర్శిరమ్య సుధా, కరుణశ్రీ ,సోమేశ్వరి.అంగన్వాడీ టీచర్స్అసోసియేషన్ జిల్లాఅధ్యక్షురాలు జోన్నలగడ్డ వెంకటరమణ,నాలుగో తరగతి ఎంప్లాయిస్ జిల్లా అధ్యక్షులు ఏనుగు బిక్షమయ్య,వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం కోశాధికారి బాలకృష్ణ,వెల్ఫేర్ ఎంప్లాయిస్ కార్యదర్శి అతీక్ పాల్గొన్నారు