Wednesday , July 24 2024

పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎం

నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది

బిఆర్ఎస్ ,బిజెపి నేతలకు మంత్రి కోమటిరెడ్డి వార్నింగ్

తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఏప్రిల్ 11

నల్లగొండ రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ…బిజెపి కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తుంది. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనం.
రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం గా ఉంటారని ఆయన అన్నారు
కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది.
కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండేలు లేరు.
పార్టీలో గ్రూపులు లేవు.
అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం.
ఏకనాథ్ షిండే ను సృష్టించిందే బీజేపీ అని అన్నారు హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే నేను దేనికైనా సిద్ధం
మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడవద్దని అన్నారు.