Wednesday , July 24 2024

కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తప్పవు

జిల్లా ఎస్పీ చందనా దీప్తి

తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ ఏప్రిల్ 10

రాజకీయ పార్టీల సభలు,సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినప్పుడు వ్యక్తుల మధ్య, వివిధ వర్గాల్లో మత పరమైన,కులం, భాషా ఆధారంగా రెచ్చగొట్టడం మరియు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఫలానా అభ్యర్థికే బలవంతంగా ఓటు వేయమనటం చేస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం చర్యలు తప్పవు అని
జిల్లా ఎస్పీ చందాన దీప్తి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు సభలు, ర్యాలీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీలు మీటింగులు ,ర్యాలీలు నిర్వహించే సమయంలో భారతీయ పౌరుల్లో, వివిధ వర్గాల్లో మతపరమైన,తెగ,
కులం, వర్గం,లేదా భాషా పరమైన అంశం ఆధారంగా దాన్ని రెచ్చగొట్టడం లేదా రెచ్చగొట్టడానికి ప్రేరేపించడం, ప్రయత్నించటం లేదా శత్రుత్వాన్ని పెంచడం, విద్వేషాన్ని రెచ్చగొట్టడం చేయటం.ఇతర రాజకీయ పార్టీలు మరియు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఫలానా అభ్యర్థికే ఓటు వేయమని బలవంతం చేయటం లేదా చట్టం తెలిసినట్టుగా కాకుండా వేరే విధంగా ప్రవర్తించటం, నేరంగా పరిగణిస్తారు.
పై నిబంధనలు ఉల్లంఘిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఐ పి సి సెక్షన్స్ 153A, 171ఈ, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్స్ 123(3)(ఏ), 125 సెక్షన్ మరియు ఇతర చట్టాల ఉల్లంఘన క్రింద కేసులు నమోదు చేయబడతాయి అన్నారు.