Saturday , October 12 2024

టీఎన్జీవోస్ నూతన క్యాలెండర్ డైరీ ఆవిష్కరించిన మంత్రి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ కెరటం: బ్యూరో నల్గొండ మార్చి 9 /2024

హైదరాబాద్ లో రాష్ట్ర రోడ్లు భవనాలు , సినిమాటోగ్రఫీ మంత్రి చేతుల మీదిగా నల్లగొండ జిల్లా టీఎన్జోస్ యూనియన్ 2024 డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి టీఎన్జీవోస్ యూనియన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టి కి తీస్కారవాల్సింది సూచించారు. మరియు ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవాడికి చేరే విధంగా కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూల దృక్పథం తో వ్యవహరిస్తుందని అన్నారు…ఈ సందర్భంగా టీఎన్జీవోస్ అధ్యక్షులు నాగిళ్ల మురళి గత 9 ఏండ్లలో ఒకటో తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 90 రోజులు కాకముందే మార్చి నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీకు నాడు జీతాలు వారి వారి అకౌంట్లో జమ చేయబడినది. అందుకు మంత్రికి సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటులో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ఉంది ఉద్యోగస్తులకు అండగా ఉంటుందని తెలియజేశారు. టీఎన్జీవోస్ నల్లగొండలో గల భవనమునకు పూర్తి చేయుటకు పూర్తిగా సహకరిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు మరియు ఉద్యోగలందరికీ కృతజ్ఞతలు తెలిపరు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి , వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్, టీఎన్గోస్ మాజీ అధ్యక్షులు ఎడుదొడ్ల వెంకట్రామి రెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల మురళి, జేజాల శేఖర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు వివిధ తాలుక అధ్యక్ష కార్యదర్శులు వివిధ ఫోరమ్ అధ్యక్ష కార్యదర్శుల మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భిక్షం, అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు, ఆశ కార్యకర్తల యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మరియు పెద్ద సంఖ్య లో ఉద్యోగుల పాల్గొన్నారు.