Sunday , May 26 2024

నల్లగొండ 326 కోట్లతొ అభివృద్ధి పనులు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ కెరటం: బ్యూరో
నల్గొండ మార్చ్ 9/2024

నల్లగొండ పట్టణంలో రూ. 326 కోట్ల వివిధ అభివృద్ధి పనులను చేపట్టినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ చుట్టూ రూ. 700 కోట్ల వ్యయంతో బైపాస్ రోడ్డు నిర్మాణానికి వచ్చే నెలలోనే టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు.
ముషంపల్లి డబల్ రోడ్డు కు రూ. 100 కోట్ల ఇప్పటికే కేటాయించామని, యువతకు ఉపాధి కల్పనలో భాగంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 6000 మంది విద్యార్థులతో జాబ్ మేళ నిర్వహించామన్నారు. రాబోయే రెండు నెలల్లో మరొక జాబ్ మేళా నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.ఎస్ ఎల్ బి సి కాల్వ లైనింగ్ పనులను చేస్తున్నామని, సొరంగ మార్గం పనులు పూర్తి చేయడాని నిధులను మంజూరు చేయించామని, త్వరలోనే ఆ పనులు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలపారు. ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిరుపేద కుటుంబాలకు సబ్సిడీ భోజన పథకం అన్నపూర్ణ క్యాంటీన్లను ప్రారంభించారు. హరే కృష్ణ మూమెంట్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిరుపేదల కు సబ్సిడీ భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.