ఏకపక్ష ధోరణిని విలేకరులు విడచి పెట్టాలి.
నకిలీలు అంటే అర్థం తెలియని విలేకరులు
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి
కామారెడ్డి జిల్లాలో కొంతమంది విలేకరు ఒంటెఎద్దు పోకడలకు పోతూ పూర్తి సమాచారాన్ని సేకరించకుండానే వార్తలు రాస్తున్నారనే విషయం జిల్లాలో చర్చనీయ అంశంగా మారింది. ఈరోజుల్లో సోషల్ మీడియా వచ్చి అరచేతిలోనే ప్రపంచంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్న విషయాన్ని విలేకరులు మర్చిపోతూ తమ ఇష్టా రీతిగా వార్తలు రాస్తున్నారని జిల్లాలో పలువురు చర్చించుకుంటున్నారు. నకిలీలకు అసలీలకు అర్థం తెలియకుండానే తమ ఇష్టం వచ్చినట్టుగా వార్తలు రాస్తూ తోటి విలేకరుల విలువలను కాలరాస్తున్నారు. ఎన్నారై సర్టిఫికెట్ ఉండి ఆ సంస్థ ఎవరినైతే గుర్తించి వారి ద్వారా వార్తలను సేకరిస్తుందో వారు విలేఖరి గానే పరిగణించబడతారు. ఈ విషయాన్ని సదరు విలేకరులు గమనించకపోవడం గమనహర్వం.
కొందరు విలేకరులు తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి అక్రమ వ్యాపారులతో చేతులు కలిపి వారు చెప్పిందల్లా రాస్తున్నారు
కొందరు విలేకరలు తమ వ్యాపారాలను కాపాడుకోవడానికి అక్రమ వ్యాపారులతో చేతులు కలిపి వారు చెప్పిందల్లా చేస్తున్నారని వ్యాపార వర్గాల్లోనే చర్చ జరుగుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. నకిలీ విలేకర్లు అంటే వారిని ఏ సంస్థ గుర్తించకుండానే ఏదో ఒక సంస్థ పేరు మీద కార్డు కొట్టించుకొని నేను విలేకరిని అని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిని నకిలీ విలేకరులు అంటారు. ఈ మధ్య బిక్నూర్ మండలంలో రైస్ మిల్లులో జరిగిన విషయంలో అక్రిడేషన్ కలిగిన రిపోర్టర్ తో పాటు ఆర్ ఎన్ ఐ కలిగిన సంస్థలు గుర్తించిన, సంస్థలను నడుపుతున్న వారు సైతం ఉన్నారు. ఈ విషయాన్ని గమనించకుండానే ఓ పేపర్లో నకిలీల దందా అంటూ వార్త కథనాన్ని రాయడాన్ని చూసి ప్రజలు విషమయం వ్యక్తం చేస్తున్నారు. విలేకర్లు విలేకరులను నకిలీ అనడం ఏమిటని ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్న సందర్భాలు సైతం లేకపోలేదు. ఇప్పటికైనా సదరు విలేకరులు విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని వార్తా కథనాలను ప్రచురించాలని ప్రజలు కోరుతున్నారు.