Wednesday , September 18 2024

40 కిలోల నకిలీ పత్తి విత్తనాల పట్టుకున్న టాస్క్ఫోర్స్ అధికారులు..??


ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ నిఘా :

తెలంగాణ కెరటం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి : మే 12

మండలంలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారన్న పక్కా సమాచారం మేరకు శుక్రవారం టాస్క్ ఫోర్స్ అధికారులు ఆసిఫాబాద్ మండలం బుర్గుడ గ్రామం శివారు లో శుక్రవారం టాస్క్ఫోర్స్ పోలీసులు నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు.
టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం. రెబ్బెన మండలం నర్లపుర్ గ్రామానికి చెందిన దుర్గం. రవి , ఆసిఫాబాద్ లోని వివిధ గ్రామాలలో అమ్మకానికి నకిలీ పత్తి విత్తనాలను(గ్లైసిల్ బి టి-3)ను తరలిస్తున్నా వాటిని స్వాధీన పరచుకున్నామన్నారు. అతనిని అదుపులోకి తీసుకుని ఒక్కరి పై ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుండి 40 కిలోల నకిలీ పత్తి విత్తనాలు వాటి విలువ దాదాపుగా ఒక లక్ష యాబై వేల రూపాయలు(రూ1,50,000) ఉంటుందని వాటిని సీజ్ చేసి ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ సుధాకర్ తెలిపారు. అమాయక రైతులను మోసం చేసే వారిని, జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్మేవారిపై కఠినమైన చర్యలు తీసుకుండామని సీఐ హెచ్చరించారు. ఈ టాస్క్ లో ఎస్ఐ సందీప్ కుమార్, కానిస్టేబుల్ వీ. మధు, పీ. రమేష్, ఆర్. సంజయ్, సంజీవ్ లు పాల్గొన్నారు..