Saturday , October 12 2024

ఆ నాలుగు ట్రాక్టర్ కే అనుమతులా?

మూల వాగు నుండి యాదేచ్చగా ఇసుక అక్రమ రవాణా!

అధికారుల సహకారంతో అక్రమ రవాణా!

ఎన్నికల బిజీలో రెవెన్యూ అధికారులు

ఆ ట్రాక్టర్ యజమాని చెప్పినట్టు వినవలసిందే

ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు

తెలంగాణ కెరటం ప్రతినిధి
వేములవాడ నవంబర్:-03

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇసుక మాఫియాను అరికట్టడానికి రాష్ట్ర సర్కార్ ఇసుక పాలసీ తీసుకువచ్చారు.
భవన నిర్మాణ అవసరాల ఉన్న ప్రతి వ్యక్తి ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరపరా జరుపుకోవాలి ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది కానీ అధికారులు సక్రమంగా పనిచేయక పోవడంతో ఇసుక మాఫియా స్థానిక అధికారుల, ప్రజాప్రతినిధులు అండదండలతో యదేచ్ఛగా ఇసుకను మల్లారం రోడ్ లో గల మూలవాగు నుండి ఇసుకను తోడేస్తున్నారు వేములవాడ అధికార పార్టీకి చెందిన నాయకుడి నాలుగు ట్రాక్టర్ల వాహనాలకు మాత్రమే తరచూ పరిమిషన్ ఇస్తున్నారని ఇసుక రవాణా చేసే ఇతర ట్రాక్టర్ యజమానులు చెప్పుకుంటున్నారు. పట్టణంలో సిసి రోడ్ల మురికి కాలువల నిర్మాణాలకు ఇసుక సరఫరా చేస్తున్నామని
సమాధానం చెబుతూ
ప్రైవేట్ గృహ వినియోగ అవసరాలకు
ఇసుకను తరలిస్తున్నారు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకపోయినా ప్రభుత్వ పనులకు ఉపయోగిస్తున్నామని అక్రమ మార్గంగా డంప్ చేస్తూ ప్రైవేటు బిల్డర్లకు ఇసుకను సరఫరా చేస్తున్నారు.
ఇదంతా ఓ అధికార పార్టీ నాయకుడు అధికారుల సహకారంతో ఈ వ్యవహారం అంతా చక్కబెడుతున్నారని వినికిడి. ప్రభుత్వ ఆదాయానికి ,ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ఇసుక రవాణా పై డిప్యూటీ ఎమ్మార్వో ను వివరణ కోరగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో చాలా బిజీగా ఉన్నామని మేము ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని ఆ అధికారుల నుండి సమాధానం ఇచ్చారు ఆ అధికారికి సమాచారం చేరవేసిన పది నిమిషాల్లోనే ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను నిలిపివేశారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ నిర్వాహకులపై ఫిర్యాదు చేస్తే ఫలితం శూన్యం అధికారులకు సమాచారం ఇస్తే అక్రమ ఇసుక రవాణా నిర్వాహకులకు సమాచారం చేరవేస్తున్నారు. అధికారులకు నెల నెల మామూలు వచ్చి చేరడంతో తమకేమీ పట్టినట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించే నాధుడే కరువయ్యారు అంటూ ప్రజలు వాపోతున్నారు. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసులు, బైండోవర్లు, ట్రాక్టర్లు, టిప్పర్లు సీజ్ చేసిన వారిలో కొంతైనా మార్పు లేదు. అధికారుల దాడుల్లో ఇసుక వాహనాల యజమానులకు 5000 నుండి 10000 రూపాయల జరిమానా విధించిన సులువుగా కట్టి వాహనాలను బయటకు తీసుకువస్తున్నారు. మరల యదేచ్చగా ఇసుకను అక్రమంగా తరలిస్తూ దందా ను మూడు ట్రిప్పులు ఆరు డంపులుగా అక్రమ రవాణా సాగుతుంది ఇసుక అక్రమంగా
దోపిడీకి గురికాకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ మూల వాగు ఇసుక దోపిడి కళ్లెం వెయ్యడం సాధ్యం అవ్వదని ప్రజలు భావిస్తున్నారు.