Sunday , May 26 2024

పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా.

డీఈఓ గోవిందరాజులు

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 18):

నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం సిర్పవాడ గ్రామంలో ఆదివారం పాఠశాల ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ప్రకారం గౌరవ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కె.రాజేష్ ని, భవన నిర్మాణ దాత ఎం.జే.ఆర్. ట్రస్ట్ అధ్యకుడు మాజీ ఎం.ఎల్.ఏ. మర్రి జనార్ధన్ రెడ్డి ని మరియు ప్రజా ప్రతినిధులు అందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించడం జరిగిందని.
ఎం.జే.ఆర్. ట్రస్ట్ అధ్యకుడు మాజీ ఎం. ఎల్. ఏ. మర్రి జనార్దన్ రెడ్డి వారి అనుచరులతో ముందుగానే వచ్చి ప్రధానోపాద్యాయుడు వద్దని వారించినప్పటికీ వినిపించుకోకుండా వారు స్వయంగా తెచ్చుకున్న రిబ్బన్ ను పాఠశాల గేట్ కి కట్టి ప్రారంభం చేయడం జరిగిందని.
లోపలికి వచ్చి శంకుస్థాపన శిలాఫలకాన్ని (2022 సం. నికి సంబధించినది) ప్రారంభించారు.
ఆ తదుపరి ఎం.ఎల్.ఏ. కె. రాజేష్ రెడ్డి వచ్చినపుడు గ్రామస్తులు విషయమును ఆయనకు తెలుపగా, వెంటనే ప్రధానోపాధ్యాయుడు ఎంఎల్ ఏ తో చర్చించి ఎం.జే.ఆర్. ట్రస్ట్ అధ్యక్షుడు. మాజీ ఎం.ఎల్.ఏ. మర్రి జనార్ధన్ రెడ్డి వారి అనుచరులు ముందుగానే వచ్చి ప్రోటోకాల్ ను ఉల్లంఘించి రిబ్బన్ కటింగ్ కార్యక్రమం చేసినందున ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని డీఈఓ గోవిందరాజులు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.తదుపరి ప్రారంభోత్సవ కార్యక్రమ తేదీని తెలియపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.