Wednesday , September 18 2024

నామినేషన్ తిరస్కరణ అభ్యర్థుల ఆగ్రహం.

ముందస్తు సూచనలు ఇవ్వకపోవడం వల్ల 10 నామినేషన్ లో తిరస్కరణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 28)

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎలక్షన్ లో నామినేషన్ వేసిన పదిమంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం జరిగింది. బహుజన లెఫ్ట్ పార్టీ అభ్యర్థి, ధర్మ సమాజ పార్టీ అభ్యర్థి ,బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి, మిగతా వివిధ ప్రాంతాలకు సంబంధించిన తొమ్మిది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. కలెక్టర్ రిటర్నింగ్ అధికారి భవనము లో సిబ్బంది లోపం వల్ల సక్రమమైన పత్రాలు తేవాలని ముందస్తు సూచనలు ఇవ్వకపోవడం వలన తగిన సమాచారాన్ని అభ్యర్థులకు అందించకపోవడం వల్ల ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు, ఉస్మానియా కాలేజీలో పీజీ చేసిన విద్యార్థులు సామాజికవేత్తల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటన్నిటికీ కారణం ఏం జరిగింది అని రిటర్నింగ్ అధికారిని వివరణ ఇవ్వాలని నామినేషన్ తిరస్కరణ అభ్యర్థులు కోరారు.
అదేవిధంగా ఈ తిరస్కరణకు గురైన వివిధ రాజకీయ పార్టీలు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థుల జేఏసీని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్లి ఈ కారణాలు చూపించి ఇక ముందు ఇలాంటి వి జరగకుండా చర్యలు తీసుకోవడానికి హైదరాబాద్ తెలంగాణ ఎన్నికల కమిషన్ ఆఫీస్ కు వెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు. జేఏసీ కమిటీ తరఫున ఈ కార్యక్రమాన్ని బహుజన లెఫ్ట్ పార్టీ ముందుకు నడిపిస్తూ మా యొక్క కార్యచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు.