Saturday , October 12 2024

చారగొండ మండల బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.

సీఎం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బి ఆర్ ఎస్ నాయకులు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 28)

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండల ఎంపీపీ, సర్పంచ్, సింగల్ విండో చైర్మన్
గుండె నిర్మల విజేందర్ గౌడ్, గురువయ్య,మరియు
మండల ముఖ్య నాయకులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన వారికి సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు మండల జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ ,చారకొండ వెంకటేష్ ఇతర నాయకులు ఉన్నారు