Friday , October 4 2024

బీజేపీ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ప్రచారానికి బ్రహ్మరథం పట్టిన అమ్రాబాద్ ప్రజలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 28):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు మండల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉదయం మద్దిమడుగులో వెలసిన అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రచారం కోసం అమ్రాబాద్ మండల కేంద్రానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ,ఎంపీ రాములుకు అమ్రాబాద్ మండల ప్రజలు వేలాదిగా తరలివచ్చి స్వాగతం పలికారు. ప్రచారoలో అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ తో పాటుగా నాగర్ కర్నూలు ఎంపీ రాములు పాల్గొన్నారు. వీరికి మహిళలు కోలాటాలతో ఘనంగా స్వాగతం పలికారు. మండలంలోని ప్రతి గ్రామంలో అడుగడుగునా మహిళలు బిజెపి అభ్యర్థి భారత్ ప్రసాద్కు ఎంపీ రాముల కు తిలకo దిద్ది హారతులు ఇచ్చి పూల వర్షం కురిపించారు. నిప్పులు కక్కే ఎండను కూడా లెక్కచేయకుండా మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రాములు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్రాబాద్ మండలoలో చేసిన అనేక అభివృద్ధి పనులు వివరించారు. అనేక గ్రామాలలో విద్యుత్ సబ్స్టేషన్ మరియు హైమాస్ట్ లైట్లు, రోడ్లు నిర్మాణాలే కాకుండా గ్రామాలలో జరిగిన ప్రతి అభివృద్ధిలో భాగమయ్యానన్నారు, ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ని గెలిపించి నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం అభ్యర్థి భరత్ మాట్లాడుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే కృష్ణా నదిపై బ్రిడ్జిని నిర్మించి ఈ ప్రాంతంను ఆంధ్రతో కలిపితే వాణిజ్య పరంగా ఈ మండలం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు, అలాగే మండలంలో మంచినీటి సమస్య తీరుస్తానని తెలిపారు.ఈ ప్రచారంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు , మండల అధ్యక్షుడు గోలి రాజు ,బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి , పార్లమెంటు ప్రభారి ఎడ్ల అశోక్ రెడ్డి , రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు మండికారి బాలాజీ ,జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు , అసెంబ్లీ కన్వీనర్ మొక్తాల రేనయ్య ,జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జానకి , జిల్లా కార్యదర్శులు సైదులు యాదవ్ ,శ్రీను నాయక్ ,వడనాల రమేష్ వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.