తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 19):
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం జంగి రెడ్డి పల్లి వెంకటేశ్వర్ల బావి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అమ్రాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం బూత్ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ సహకారంతో ఇంటింటి బిజెపి కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తా అని మోసం చేసిన సందర్భంగా ప్రజలు ఈ ఎంపీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అదే రేషన్ కార్డు ఉంటే నరేంద్ర మోడీ ఇచ్చే ఫ్రీ బియ్యం మాకు వచ్చేవి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వలన మాకు అవకాశం లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన చెందుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు ముందుకు వచ్చి బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ కు ఓటు వేసి గెలిపిస్తామని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి నాగరాజు, అమ్రాబాద్ మండల అధ్యక్షులు గోలి రాజు, మొగిలి గణేష్, కంచర్ల అజయ్, వెలిజాల అభిరామ్, ఎలిజాల హనుమంతు, మెడమోని నాగరాజు, నల్లగంతుల రాఖి గుండాల రాజు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.