Wednesday , July 24 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగు పల్లి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 19):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అమ్రాబాద్ మండలం తెలుగు పల్లి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.కాంగ్రెస్ పార్టీలోకి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ. ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని, కేంద్రంలో రాహుల్ గాంధీతోనే ఈ దేశం ప్రజాస్వామ్యం రక్షించబడుతుందనే నమ్మకంతోనే సంపూర్ణ మద్దతుగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగిందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలనే లక్ష్యంతోనే పార్టీలోకి చేరడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.