Friday , November 15 2024

బండలాగుడు పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 19):

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో శుక్రవారం వృషభ రాజులతో బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వృషభ రాజులు బండలాగుడు పోటీల్లో పాల్గొన్నారు గ్రామస్తులతో నాయకులతో కలిసి బండలాగుడా పోటీలను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తిలకించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.