Wednesday , September 18 2024

కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 19):

నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం శివారులో గంగాపురం గ్రామానికి చెందిన శేఖర్ తన ద్విచక్ర వాహనంపై తన స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో శేఖర్ కు తీవ్ర గాయాలు,కుడికాలు విరిగింది. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించి నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.