Sunday , May 26 2024

వచ్చే ఎన్నికల్లో డాక్టర్ మల్లు రవిని గెలిపించండి.

ఎన్నికల ప్రచారంలో డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి(ఏప్రిల్ 13):

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ మల్లు రవిని అత్యంత మెజార్టీతో గెలిపించాలని డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవితో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధి చెందాలంటే డాక్టర్ మల్లు రవి గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణా రెడ్డి ,
మాజీ మంత్రి చిత్త రంజన్ దాస్
జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్
మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ ,
మండల పార్టీ అధ్యక్షులు బాల్ రామ్ గౌడ్ ఇతర మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.