Monday , July 22 2024

అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి(ఏప్రిల్ 13):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో నేడు ఆదివారం ఉదయం 9 గంటలకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అంబేద్కర్ యువజన సంఘం డివిజన్ నేతలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రానున్నారని అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి పట్టణ పుర ప్రముఖులు రాజకీయ నాయకులు విద్యార్థులు, విద్యార్థినిలు, ఉద్యోగులు, మేధావులు, అన్ని రంగాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.