Monday , September 16 2024

సీతారామచంద్ర ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న ఎంపీ రాములు, బిజెపి అభ్యర్థి భరత్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 11):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండలం లో గల అపర భద్రాద్రి రాముడు గా పేరొందిన సిర్సనగండ్ల సీతారామచంద్ర దేవాలయం లో గురువారం ఎంపీ పోతుగంటి రాములు ఆయన కుమారుడు బిజెపి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
అనంతరం వేదమంత్రాల నడుమ తన (కుమారుని) నాగర్కర్నూల్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి భరత్ ప్రసాద్ ని ఆశీర్వదించిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.అనంతరం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రాములు మరియు ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తలోజ ఆచారి పలువురు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.