Saturday , October 12 2024

పూలే కలలుగన్న సామాజిక న్యాయం సాధించాలి.తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 11)

పూలే కలలుగన్న సామాజిక న్యాయం సాధించాలని సమాజంలో కులం మతం వర్గం ప్రాంతం అన్నిటికీ అతీతంగా సామాజిక న్యాయం కోసం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప మహాయోధుడు జ్యోతిబాపూలే యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కృష్ణ కొనియాడారు.ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని అచ్చంపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్ కృష్ణ మాట్లాడుతూ 1827ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా లో జన్మించిన పూలే. సావిత్రిబాయిని వివాహమాడి ఆమెకు తనే స్వయంగా చదువు నేర్పించి బాలికల కోసం దేశంలోనేమొట్టమొదట . మహిళల చదువుకోసం పాఠశాలల ను ప్రారంభించి. వారి అభ్యున్నతి కోసం కృషి చేసిన పూలే ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని పిలుపునిచ్చారు. కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా పూలే ప్రత్యక్ష పోరాటాలు చేశారని గుర్తు చేశారు అంబేద్కర్ కు గురువుగా పూలే ఉండడం దేశానికి ఆదర్శమని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు ఈ తరం యువత మహనీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు పోరాటాలను నిర్మించి అసమానతలు లేని సమాజం కోసం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్ నాయక్, సిఐటియు జిల్లా నాయకులు మల్లేష్, మహిళా సంఘం నాయకురాలు సైదమ్మ, పార్వతమ్మ రజిత, శివ లీల, యుటిఎఫ్ జిల్లా నాయకులు రాములు, లక్ష్మణ్ ,డాక్టర్ భాను చందర్, బిక్కు, బాబురావు, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సైదులు తదితరులు పాల్గొన్నారు.