Tuesday , July 16 2024

మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం అందరికీ ఆదర్శం.

ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 11):

ఒక సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటం గా ఎదిగిన మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం మన అందరికీ ఆదర్శనీయమని బీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాలు, దళిత జనోద్ధరణకు పూలే ఎంచుకున్న బాట, అనుసరించిన మార్గం సమాజ శ్రేయస్సును కాంక్షించే వారందరికీ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.తమ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే ప్రగతి భవన్‌కు మహాత్మా జ్యోతిభా పూలే పేరు పెట్టి ప్రజా భవన్‌గా మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.