అచ్చంపేటలో జరిగే పార్లమెంట్ సన్నాహక సమావేశానికి అందని ఆహ్వానం.
ఎంపీ రాములు ఆయన కుమారుడు భరత్ పార్టీ మారనున్నారా?
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఫిబ్రవరి 25):
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో జరిగే బి ఆర్ ఎస్ పార్టీ పార్లమెంట్ ఆదివారం జరిగే సన్నాహక సమావేశానికి నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ పోతుగంటి రాములుకు ఆహ్వానం అందకపోవడంతో పలువురు రాములు అభిమానులు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోతుగంటి రాములుకు నాగర్ కర్నూల్ జిల్లాలో తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు రాములు అంటే మంచి వ్యక్తిగా జిల్లాలో పేరు. ఎంపీ పోతుగంటి రాములు ఆయన కుమారుడు భరత్ పార్టీ మారనున్నారా అన్న సందేహం జిల్లాలో పార్టీ శ్రేణుల్లో మొదలైంది. గత రెండు సంవత్సరాలుగా రాములు కుమారుడు భరత్ కు జడ్పిటిసి పీఠం దక్కకపోవడంతో ఆయన పార్టీకి అంటి అంటున్నట్లు ఉన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కూడా శిలాఫలకంపై ఎంపీ రాములు పేరు లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తూ ప్రశ్నార్థకంగా మారింది. కావాలని పార్టీకి ఎంపీ రాములు దూరంగా ఉంచినట్లు పలువురు బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాములు కు బి ఆర్ ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది.ఇది గుర్తించిన ఎంపీ రాములు ముందే తన ప్లాన్ లో తాను ఉన్నట్లు సమాచారం. కేటీఆర్ రాక సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని తాజా మాజీ ఎమ్మెల్యేలకు సమాచారం అందించిన జిల్లా అధ్యక్షుడు ఎంపీ రాముల కు సమాచారం అందించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కేటీఆర్ అప్పటికప్పుడు నాగర్ కర్నూల్ లో జరిగే సన్నాహక సమావేశానికి రావాలని తన పిఏ ద్వారా ఫోన్ చేయించినట్లు సమాచారం.ఏది ఏమైనా పటికి ఎంతో ఉన్న ఎంపీ రాములు పార్టీ మరన్నారా? లేక పార్టీలోనే కొనసాగుతారా అన్న సందేహంలో ఆయన అభిమానులు, అనుచరులు, జిల్లాలో చర్చించుకుంటున్నారు.