Wednesday , July 24 2024

పూలే స్వయంకృషితో దేశానికి వెలుగు దివ్య అయ్యారు.

ఎమ్మెస్ ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బుక్కాపురం మహేష్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 11):

మహాత్మ జ్యోతిరావు పూలే స్వయంకృషితో ఎదిగి దేశానికి వెలుగు దివ్వే అయ్యారు అని ఎంఎస్ఎఫ్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి బుక్ ఆఫ్ మహేష్ అన్నారు గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ
మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆధునిక భారతీయ నవయుగ వైతాళికుడు. వెనుకబడిన సామాజిక వర్గాలకు చెందిన మాలికులంలో జన్మించి భారతదేశానికి మార్గదర్శనం చేసిన మహనీయులు. ఎందరో ఫూలే నుండి స్ఫూర్తి పొంది సంఘ సంస్కరణలు చేపట్టారని. సమాజంలో నిరక్షరాస్యత, మూఢ విశ్వాసాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఇంగ్లాండు వారి వలస పాలన, బ్రాహ్మణాధిక్యత, దురాగతాలు, బాల్య వివాహాలు కొనసాగుతున్న కాలంలో జన్మించి స్వయంకృషితో దేశానికి వెలుగుదివ్వె అయ్యారు. మరాఠీలో, ఇంగ్లీషులో చదువుకొని, రెండు భాషల్లోను అనేక రచనలు చేశారని. సామాజిక ఉద్యమకారుడిగా ఫూలే స్పర్శించని అంశం లేదు. కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్న వివక్షను ప్రశ్నించారు. మనుషులందరూ సమానమేనని, దేవుడు ఒక్కడే అని, దేవుడు ముందు అందరూ సమానమేనని, దేవుడ్ని కొలవడానికి మధ్యవర్తిగా పూజారులు, బ్రాహ్మణులు అక్కరలేదని ఫూలే ప్రబోధించారు.
మనిషిని మనిషిగా గౌరవించాలని, కులాన్నిబట్టి కాదని, జీవితమంతా పోరాడారు. రాజుల కాలంనాటి దౌర్జన్యాలను ఎదిరించారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్థలను, విలువలను, సంస్కృతిని, జీవన విధానాన్ని అధ్యయనం చేశారు. థామస్ పెయిన్ 1791లో రాసిన ‘మానవ హక్కులు’ పుస్తకం, అమెరికా అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ జీవిత చరిత్రను చదివి, ఫ్రెంచి విప్లవం గురించి అధ్యయనం చేసి ఎంతో ప్రభావితులయ్యారని అన్నారు.
వివక్ష కుల వ్యవస్థ రూపుమాపాలంటే అన్నిటికీ ఆధునిక విద్య ముఖ్యమని భావించారు. మూఢ నమ్మకాలను తొలగిస్తే తప్ప ప్రజలు చైతన్యవంతులు కారని, ఉద్యమించారు. ఏ కులం గొప్పది కాదు. ఏ కులం చిన్నది కాదు, అన్ని కులాలు సమానమే అని భావించిన ఫూలే బ్రాహ్మణులను కూడా కలుపుకొని అనేక సంఘసంస్కరణలను చేపట్టారు. స్త్రీవిద్యకు ప్రాధాన్యతనిచ్చారు. వితంతువుల కష్టాలను చూసి చలించిపోయారు. బాల్య వివాహాల వల్ల, 15-20 ఏళ్ళ లోపే వితంతువులై దుర్భర జీవితం జీవిస్తూ తల్లులైన వారి గర్భశోకాన్ని గమనించారు. గర్భస్రావాలవల్ల చనిపోతున్న వితంతువులను మానవతా దృక్పథంతో చేరదీసి వారు పిల్లల్ని కనాలని, ఆ పిల్లలను సాదరంగా పెంచి పోషించాలని, వారి కోసం స్కూళ్ళను, హాస్టళ్ళను ప్రారంభించారు. నిమ్నవర్గాల బాలబాలికలకు విద్య అందిస్తే రాబోయే తరం ఎంతగానో ఎదుగుతుందని భావించారు. ఫూలే కృషిని గమనించి డా. బి.ఆర్. అంబేడ్కర్ తండ్రి రామ్జీ ఎంతగానో ప్రభావితులయ్యారని అన్నారు. తన పిల్లలను బాగా చదివించాలని భావించారు. ఆనాటి సమాజంలో బాల్య వివాహాలే జరిగేవి. సావిత్రిబాయి ఫూలేతో జ్యోతిబా ఫూలే పెళ్ళి జరిగినప్పుడు ఇద్దరూ మైనారిటీ తీరనివారే. సావిత్రిబాయిని విద్యా వంతురాలిని చేసి, ఉపాధ్యాయు రాలిగా తీర్చిదిద్ది పాఠశాలను నడిపించారు. ఎంతో సంస్కారాన్ని అలవర్చుకున్న సావిత్రిబాయి ఫూలే ప్లేగువ్యాధి బాధితులకు సేవలు చేస్తూ ప్లేగు వ్యాధితోనే మరణించారు. ప్లేగు వ్యాధి అంటువ్యాధి అని తెలిసి కూడా జ్యోతిరావు ఫూలే 1890లో చనిపోయిన తర్వాత కూడా తన సేవలను కొనసాగించి ప్లేగువ్యాధితో 1897లో మరణించారు. ఇలా ఆదర్శ ఇల్లాలిగా, ఉపాధ్యాయురాలిగా, సంఘసేవకురాలిగా సావిత్రిఫూలే ఎదిగి దేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా ప్రసిద్ధికెక్కింది. ఇలా తన చుట్టూత ఉన్న ప్రజలను, ఎందరో మిత్రుల ఎదుగుదలకు, సమాజం కోసం, సంఘ సంస్కరణల కోసం కృషి చేశారు జ్యోతిరావు ఫూలే.
జ్యోతిరావు ఫూలే కృషి దేశంలోని ఆనాటి సంఘసంస్కర్తలను, జాతీయ నాయకులను ఎంతగానో ఆకర్షించిందని అని అన్నారు భావి యువత మహాత్మ జ్యోతిరావు పూలే ను ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జై భారత్ రాష్ట్ర అధ్యక్షుడు దున్న లక్షమేశ్వర్ మానవ హక్కుల సంఘం నేత పోలె నరేందర్, ఎం ఎస్ ఎఫ్ నాయకులు బర్పాటి రాజు ,బాబు ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.