Monday , September 16 2024

ప్రమాదంలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 11):
నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసాన్పల్లి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలు ట్రాక్టర్పై పనికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడ్డ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న 20 మంది ఉపాధి హామీ కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి గాయాలైన వారిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి 108 వాహనాల్లో తరలించారు. విషయం తెలుసుకున్న డిసిసి అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మోపతయ్య అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి గాయపడ్డ వారిని పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ వైద్యులతో మాట్లాడుతూ గాయపడ్డ వ్యక్తులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గాయపడిన ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్లి పరీక్షలు నిర్వహించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వారిని కోరారు.