నేటి వరకు 99019 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి డిఇఓ గోవిందరాజులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 10):
జిల్లాలో జరుగుతున్న పదో తరగతి మూల్యాంకనం కేంద్రానికి ఏప్రిల్ 9 తేదీన ఉగాది పండుగ, 11 తేదీన రంజాన్ పండగలను పురస్కరించుకొని మంగళ, గురువారాల్లో సెలవు ప్రకటించారు. ఈ రెండు పండుగలు సందర్భంగా సెలవు ఉంటుందని మిగతా రోజులు యథావిధిగా మూల్యాంకనం కేంద్రంలో ఉపాధ్యాయులు విధులు నిర్వహించాల్సి ఉంటుందని నాగర్ కర్నూల్ డిఈఓ గోవిందరాజులు తెలిపారు.నాగర్ కర్నూల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం 6వ రోజు సోమవారం 23,161 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడం జరిగిందన్నారు.
609 మంది ఉపాధ్యాయులు పదో తరగతి స్పాట్లో పాల్గొని సోమవారంతో మొత్తం 99019 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయడంతో 65 శాతం ప్రక్రియ పూర్తయిందని డిఇఓ తెలిపారు.