Tuesday , July 16 2024

జిల్లా ప్రజలందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు,

జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 10):

క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రోధి నామ సంవత్సరం అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను .
నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్,
తెలుగు ప్రజలకు నూతన సంవత్సరాది అయిన ఉగాదిని ప్రతి ఒక్కరు ఆనందంగా జరుపుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్,అన్నారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు వారికీ ఉగాది పండగా ఎంతో ప్రాముఖ్యము కలదు అని తెలిపినారు ఉగాది అంటేనే షడ్రుచుల సమ్మేళనంగా చేసే పచ్చడి గుర్తు వస్తుంది. తీపి, చేదు, వగరు, పులుపు కలగలిపిన సమ్మేళనమే ఉగాది పచ్చడని ఇందులో మన జీవిత భావాలను తేలిపే నిఘూడ అంశాలు ఇమిడి ఉన్నాయని అన్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలను పెటుకొని, ఆ లక్ష్యాలను అందుకునేందుకు ప్రణాళికబద్దంగా కష్టపడాలని అన్నారు. ఉగాది పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.