Wednesday , July 24 2024

ఈద్గా వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 10):

ముస్లిం సోదరులు గత నెల రోజులుగా రంజాన్ ఉపవాస దీక్షలు చేపట్టి బుధవారం ముగించుకుని గురువారం రంజాన్ పండుగను జరుపుకుంటున్న సందర్భంగా పట్టణంలోని ముస్లింలు చేసే ప్రార్థన కోసం ఈద్గా వద్ద బుధవారం ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రార్థన స్థలం ఏర్పాట్లు పరిశీలించారు. సామూహిక ప్రార్ధనలకు ప్రార్ధన స్థలంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు సిద్ధిక్, మోయిజ్, అన్వర్, షకీల్, శంషాద్, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.