Tuesday , July 16 2024

ఉమామహేశ్వరంలో నిత్య అన్నదానం నిధుల దారి మళ్లింపు.

నిధుల దారి మళ్లింపు పై విచారణ చేపట్టిన చైర్మన్.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 10):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండల పరిధిలోగల శ్రీ ఉమామహేశ్వర దేవస్థానంలో నిర్వహించే నిత్య అన్నదానానికి పలువురు దాతలు విరాళంగా దాతలు చెల్లించిన డబ్బు దారి మల్లయని నిత్యా అన్నదాన విరాళాల సేకరణ లావాదేవీల నిర్వహణ కోసం ఓ ప్రైవేటు ఉద్యోగికి ఆలయ అధికారులు బాధ్యతలు అప్పగించడంతో ఖాతాలో జమ చేసిన నిధులను అధికారులు పరిశీలించగా 2024 జనవరి నుంచి మార్చి వరకు లక్ష రూపాయలు పక్క దారి మళ్ళినట్లు గుర్తించి సదరు ప్రైవేటు వ్యక్తిని గత నెలలోనే విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తుంది నిధులు పక్కదారి మల్లడంపై ఆలయ చైర్మన్ విచారణ చేపట్టినట్లు సమాచారం.