Saturday , October 12 2024

ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ లో ర్యాంక్ సాధించిన నల్లమల విద్యార్థి.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 10):

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అంకిరోని పల్లి గ్రామానికి చెందిన నేనావత్ రామ్ లాల్ పెద్ద కుమారుడు అక్షిత్ బుధవారం వెలువడిన ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఆరవ తరగతి ఫలితాల్లో ర్యాంకు సాధించి సీటు పొందాడు. ఈ సందర్భంగా భారత్ సైనిక్ స్కూల్ లో నల్లమల ప్రాంతంలో ఆరవ తరగతిలో సీటు సాధించిన మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు నమోదు చేశాడు ఈ సందర్భంగా గ్రామస్తులు తల్లిదండ్రులు బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. తల్లిదండ్రుల సహకారంతో సాధ్యమైందని అక్షిత్ వివరించాడు. భవిష్యత్తులో గ్రామంలో తన తోటి పిల్లలకి ఆదర్శంగా ఉంటానని హర్షం వ్యక్తం పరిచాడు.