Wednesday , July 24 2024

ఉగాది పండగ సందర్భంగా విద్యార్థులకు బట్టల పంపిణీ.

తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (ఏప్రిల్ 10):

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని వనవాసి కళ్యాణ పరిషత్ లో చదువుకుంటున్న 30 నుండి 40 మంది చెంచు విద్యార్థులకు వారి తాత అమ్మమ్మల జ్ఞాపకార్థం ఉగాది పండుగ సందర్భంగా ఎస్ .రాజు చెంచు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు దత్తత బట్టలు పంపిణీ చేసి భోజనం ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వనవాసి కళ్యాణ పరిషత్ లో చదువుకుంటున్న చెంచు పిల్లల కోసం 10 క్వింటాళ్ల బియ్యాన్ని ఇస్తాని వనవాసి కళ్యాణ పరిషత్ నిర్వాహకులకు హామీ ఇచ్చాడు ఈ సందర్భంగా ఎస్. రాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రాణించి చదువుకున్న సంస్థకు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తేవాలని విద్యార్థులకు సూచించారు.